మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 22, 2020 , 17:51:39

‘ఐయామ్ బ్యాడ్మింటన్​’ అంబాసిడర్​గా సింధు

‘ఐయామ్ బ్యాడ్మింటన్​’ అంబాసిడర్​గా సింధు

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) చేపట్టిన ‘ఐయామ్ బ్యాడ్మింటన్’ ప్రచార కార్యక్రమానికి అంబాసిడర్​గా ప్రపంచ చాంపియన్, తెలుగమ్మాయి​ పీవీ సింధు ఎంపికైంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. నిబద్ధత, నిజాయితీతో బ్యాడ్మింటన్ ఆడుతామని ప్లేయర్లు ప్రమాణం చేసి.. ఆట పట్ల ప్రేమ, గౌరవాన్ని చాటుకునేందుకు ఈ కార్యక్రమాన్ని బీడబ్ల్యూఎఫ్ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి అంబాసిడర్​గా ఎంపికైన సందర్భంగా సింధు స్పందించింది. “ఏ క్రీడ అయినా నిజాయితీతో స్వచ్ఛంగా ఆడడం చాలా ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ మాటలను మరింత హైలెట్ చేయాలి. దీనివల్ల మరింత మంది ప్లేయర్లకు ఈ సందేశం చేరుతుంది” అని సింధు చెప్పింది.

‘ఐయామ్ బ్యాడ్మింటన్​’ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్ లీ(కెనడా), జెంగ్ సీ వీ(చైనా), హుయాంగ్​ యా క్వింగ్​(చైనా), జాక్ షెఫర్డ్​(ఇంగ్లండ్​), వలెస్కా(జర్మనీ), చెన్ హొయాన్​(హాంకాంగ్​), మార్క్ జ్విబ్లెర్​(జర్మనీ) కూడా అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.

 


logo