ఆదివారం 07 జూన్ 2020
Sports - Mar 31, 2020 , 20:15:49

షట్లర్లకు ఊరట: బ్యాడ్మింటన్ ర్యాంకుల నిలుపుదల

షట్లర్లకు ఊరట: బ్యాడ్మింటన్ ర్యాంకుల నిలుపుదల

న్యూఢిల్లీ: షట్లర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టోర్నీలన్నీ రద్దవుతుండడంతో సీనియర్, జూనియర్ విభాగాల ప్రపంచ ర్యాంకులను నిలుపుదల చేసింది. తదుపరి సమాచారం వెల్లడించే వరకు  మార్చి 17నాటి ర్యాంకులే షట్లర్లకు కొనసాగుతాయని మంగళవారం ప్రకటించింది.

 “ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ -2020​ ముగిసిన మార్చి 17నాటి ర్యాంకులనే నిలుపుదల చేస్తున్నాం. తర్వాతి సమాచారం వెల్లడించే వరకు సీనియర్​, జూనియర్ విభాగాల్లో షట్లర్లకు నాటి ర్యాంకులే కొనసాగుతాయి. తర్వాతి అంతర్జాతీయ టోర్నీ ఎప్పుడూ జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మే, జూన్ నెలల్లోని టోర్నీలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది” అని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.

టోర్నీలు రద్దవుతున్నా ర్యాంకులను స్తంభింపజేయకపోవడంపై భారత్​తో పాటు చాలా దేశాల షట్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఒలింపిక్ క్వాలిఫికేషన్ ప్రక్రియ​పైనా స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో ర్యాంకుల అంశాన్ని పరిశీలిస్తున్నామని గత వారమే బీడబ్ల్యూఎ​ఫ్ తెలిపింది. మొత్తానికి ర్యాంకులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 


logo