గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 13:39:47

'బుష్‌ఫైర్‌' మ్యాచ్‌లో సచిన్‌, పాంటింగ్‌ సందడి

'బుష్‌ఫైర్‌' మ్యాచ్‌లో  సచిన్‌, పాంటింగ్‌ సందడి

రికీ పాంటింగ్‌ లెవెన్‌ టీమ్‌కు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్న బుష్‌ ఫైర్‌ క్రికెట్‌ బాష్‌ చారిటీ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరుగుతోంది. జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ లెవెన్‌ టీమ్‌కు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో  టీమ్‌కు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌  గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌ జట్టుకు  పైన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.  10 ఓవర్ల మ్యాచ్‌లో రెండు జట్లు తలపడునున్నాయి. 

భారత్‌ నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌ తరఫున ఆడుతున్నాడు.  సిడ్నీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మ్యాచ్‌ను ఆదివారం నిర్వహిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మాజీ క్రికెటర్లు ఒక దగ్గర  చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేయనున్నారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంటింగ్‌ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులు చేసింది. పాంటింగ్‌(26), బ్రయాన్‌ లారా(30) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనలో గిల్‌క్రిస్ట్‌ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో గిల్‌క్రిస్ట్‌ టీమ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువరాజ్‌సింగ్‌ 6 బంతులాడి కేవలం రెండే పరుగులు చేయగా..బౌలింగ్‌లో ఒక ఓవర్‌ వేసి వికెట్‌ తీసి 10 పరుగులు ఇచ్చాడు.logo