మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 15:02:38

'కేకేఆర్‌' జెర్సీ రంగుల్లో బుర్జ్‌ఖలీఫా

'కేకేఆర్‌' జెర్సీ  రంగుల్లో బుర్జ్‌ఖలీఫా

దుబాయ్‌  ప్రపంచంలోనే అత్యంత  ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ఖలీఫా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జెర్సీ రంగులతో ధగధగలాడింది.  పర్పుల్‌, గోల్డ్‌ కలర్లతో ఫ్రాంఛైజీ లోగోతో పాటు ఆటగాళ్ల ఫొటోలను కూడా భవనంపై  ప్రదర్శించింది.  బుధవారం అబుదాబిలోని  షేక్‌ జాయేద్‌ స్టేడియంలో   ముంబై ఇండియన్స్‌తో దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా తలపడుతుంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ తొలి మ్యాచ్‌ ఆడుతున్న కేకేఆర్‌కు బుర్జ్‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో ఘన స్వాగతం పలికింది.

కేకేఆర్‌ జెర్సీ కలర్లలో బుర్జ్‌ఖలీఫాను విద్యుద్దీపాలతో అలకరించడంపై ఫ్రాంఛైజీ ట్విటర్లో ధన్యవాదాలు చెప్పింది. రాత్రివేళ యూఈలో   అద్భుత స్వాగతం లభించిందని పేర్కొంది.  దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది. 


logo