బుధవారం 15 జూలై 2020
Sports - May 13, 2020 , 19:04:28

అర్జున అవార్డుకు బుమ్రా పేరు నామినేట్​!

అర్జున అవార్డుకు బుమ్రా పేరు నామినేట్​!

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు టీమ్​ఇండియా స్టార్ పేసర్​ జస్ర్పీత్​ బుమ్రా పేరును బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యంగా ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. 2019లోనూ బుమ్రా నామినేట్​ అయినా సీనియారిటీతో పాటు ఎంతో కాలంగా రాణిస్తున్న ఆల్​రౌండర్ రవీంద్ర జడేజకు పురస్కారం దక్కింది.

“గతేడాది రవీంద్ర జడేజ, బుమ్రా, మహమ్మద్ షమీ పేర్లను నామినేట్ చేశాం. అయితే జడేజ సీనియర్ కావడంతో పాటు ఎన్నో ఏండ్లుగా టీమ్​ఇండియా తరఫున రాణిస్తున్నాడు. దీంతో బుమ్రాకు అవార్డు దక్కలేదు. ఈసారికి ముందుండేందుకు బుమ్రాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో బుమ్రా టాప్​ర్యాంకులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్​, ఆస్ట్రేలియా, వెస్టిండీస్​ దేశాల్లో ఐదు వికెట్లు సాధించిన ఒకేఒక్క ఆసియా బౌలర్ బుమ్రానే” అని బీసీసీఐకి చెందిన ఆ అధికారి చెప్పారు. ఒకవేళ బీసీసీఐ ఎక్కువ పేర్లను నామినేట్ చేయాలనుకుంటే జాబితాలో బుమ్రా తర్వాత టీమ్​ఇండియా ఓపెనర్ ధవన్​ను చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తాజావార్తలు


logo