గురువారం 02 జూలై 2020
Sports - May 11, 2020 , 15:31:57

బుమ్రా బౌలింగ్‌లో కీపింగ్ క‌ష్టం: కేఎల్ రాహుల్‌

బుమ్రా బౌలింగ్‌లో కీపింగ్ క‌ష్టం:  కేఎల్ రాహుల్‌

ముంబై:  టీమ్ఇండియా స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కీపింగ్ చేయ‌డం కాస్త క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ లోకేశ్ రాహుల్ అన్నాడు. రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ‌టంతో ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో వికెట్ కీప‌ర్ అవ‌తార‌మెత్తిన రాహుల్‌.. ఈ ఫార్మాట్‌లో అత్యుత్త‌మ కీప‌ర్‌గా ఎద‌గ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. 

ఈ క్ర‌మంలో అభిమానుల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన రాహుల్‌..`వికెట్ల వెనుక బుమ్రాను కాచుకోవ‌డం క‌ష్టం అత‌డి బంతులు అనూహ్యంగా దూసుకొస్తుంటాయి. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అత్యుత్త‌మ కీప‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్నా. ఐపీఎల్ 2016 సీజ‌న్ నా కెరీర్‌కు చాలా హెల్ప్ చేసింది. దానివ‌ల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా. క్రిస్ గెల్ సూప‌ర్ ఓపెన‌ర్‌. అత‌డితో క‌లిసి బ్యాటింగ్ చేయ‌డాన్ని ఆస్వాదిస్తా` అని చెప్పుకొచ్చాడు. 


logo