టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ గ్రేట్ కర్ట్లీ ఆంబ్రోస్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్‌లో బుమ్రా టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో తాను చూసిన బౌలర్లలో బుమ్రా శైలి భిన్నంగా ఉంటుందని అన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా తనను ఎంతగానో ఆకట్టుకున్నాడని తెలిపాడు. ఆంబ్రోస్ 98 టెస్టుల్లో 405 వికెట్లు పడగొట్టాడు. .
‘టీమ్ఇండియాకు మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. నేను బుమ్రాకు పెద్ద అభిమానిని.నేను చూసిన బౌలర్లలో అతడు చాలా భిన్నమైన వాడు. అతడు చాలా ప్రతిభావంతమైన ఆటగాడు. భవిష్యత్‌లో బాగా రాణించాలని నేను ఆశిస్తున్నానని’ ఓ యూట్యూబ్ షోలో ఆంబ్రోస్ వివరించాడు.
27ఏండ్ల బుమ్రా టెస్టుల్లో 400 వికెట్లు తీయగలడా అని అడిగిన ప్రశ్నకు ఆంబ్రోస్ బదులిచ్చాడు.
అతను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండి సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగితే కచ్చితంగా ఆ మైలురాయిని అందుకుంటాడని మాజీ విండీస్ క్రికెటర్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు బుమ్రా 19 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు.