మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 05, 2020 , 22:03:34

ముగ్గురు డకౌట్‌... 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

ముగ్గురు డకౌట్‌... 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

దుబాయ్‌:  క్వాలిఫయర్‌-1లో భాగంగా ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతులెత్తేసింది.  టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా(0), శిఖర్‌ ధావన్‌(0), రాహానె(0) డకౌటయ్యారు. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లోనే షా, రహానె పెవిలియన్‌ చేరారు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే ధావన్‌..బౌల్డ్‌ అయ్యాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్(12)‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.  బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో  షాట్‌ ఆడిన అయ్యర్‌..కవర్‌లో రోహిత్‌ చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.