శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 00:11:07

ఆండీ ఆగయా..

ఆండీ ఆగయా..

న్యూఢిల్లీ: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌కు ముందు బ్రిటన్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే ఫామ్‌లోకొచ్చాడు. చాన్నాళ్ల తర్వాత కోర్టులో అడుగుపెట్టిన ముర్రే వెస్ట్రన్‌ ఓపెన్‌ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రీక్వార్టర్స్‌లో ఆండీ 6-3, 3-6, 7-5తో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. ‘విరామం తర్వాత తిరిగి లయ అందుకోవడం ఆనందంగా ఉంది. జ్వెరేవ్‌ వంటి మంచి ఆటగాడిపై విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మ్యాచ్‌ అనంతరం ముర్రే పేర్కొన్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సోమవారం నుంచి బయో సెక్యూర్‌ వాతావరణంలో యూఎస్‌ ఓపెన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


logo