శుక్రవారం 03 జూలై 2020
Sports - May 30, 2020 , 22:49:02

బ్రిటన్‌లో క్రీడలకు అనుమతి

బ్రిటన్‌లో క్రీడలకు అనుమతి

బ్రిటన్‌లో క్రీడలకు అనుమతి 

లండన్‌: బ్రిటన్‌లో క్రీడల పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా గత మూడు నెలల నుంచి ఆగిపోయిన క్రీడా కార్యకలాపాలు జూన్‌ 1 నుంచి మొదలుకాబోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన నిబంధనల మధ్య క్రీడా టోర్నీలకు అనుమతి ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ‘వేచిచూడటం అయిపోయింది. కఠినమైన నిబంధలు, స్పష్టమైన మార్గదర్శకాల మధ్య దేశంలో క్రీడలు త్వరలో మొదలుకాబోతున్నాయి. ప్రేక్షకుల్లేకుండా మూసివున్న స్టేడియాల్లో ఆటలకు అనుమతి ఇచ్చాం. ఇప్పటి వరకు వ్యక్తిగత విభాగాలు మాత్రమే అవకాశమిచ్చాం. త్వరలో మరోమారు చర్చించి టీమ్‌ఈవెంట్ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. దీనికి సంబంధించి డిజిటల్‌, కల్చరల్‌ మీడియా అండ్‌ స్పోర్ట్స్‌(డీసీఎమ్‌ఎస్‌) ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఇందులో అథ్లెట్లు, అధికారులు పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి’ అని డీసీఎమ్‌ఎస్‌ కార్యదర్శి ఒలీవర్‌ డౌడెన్‌ అన్నాడు. ఇదిలా ఉంటే జూన్‌ 17 నుంచి ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఈపీఎల్‌) మొదలుకాబోతున్నది. లీగ్‌ కోసం ఇప్పటికే వివిధ క్లబ్‌ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు.  


logo