శనివారం 31 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 11:40:17

డీన్ జోన్స్‌కు సీపీఆర్ చేసిన బ్రెట్ లీ

డీన్ జోన్స్‌కు సీపీఆర్ చేసిన బ్రెట్ లీ

హైద‌రాబాద్‌:  ముంబైలోని ట్రైడెంట్ హోట‌ల్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డీన్ జోన్స్ గుండెపోటుతో హ‌ఠాన్మ‌ణం పొందిన విష‌యం తెలిసిందే.  ఐపీఎల్ కోసం స్టార్ ఇండియాతో ఒప్పందంలో భాగంగా కామెంట‌రీ ఇచ్చేందుకు డీన్ జోన్స్ ఇండియాకు వ‌చ్చాడు.  ఇత‌ర కామెంటేట‌ర్ల‌తో క‌లిసి జోన్స్ ముంబై హోట‌ల్‌లో బ‌స చేశాడు. అయితే గురువారం మ‌ధ్యాహ్నం హ‌ఠాత్తుగా గుండెపోటు రావ‌డంతో డీన్ క‌న్నుమూశారు.  కామెంటేట‌ర్ డీన్ జోన్స్‌కు గుండెపోటు వ‌చ్చిన స‌మ‌యంలో అక్క‌డే మ‌రో మాజీ ఆసీస్ క్రికెట‌ర్ బ్రెట్ లీ అక్క‌డే ఉన్న‌ట్లు తెలిసింది.  డీన్ జోన్స్‌ హోట‌ల్ లాంజ్‌లో కుప్ప‌కూల‌డంతో.. బ్రెట్ లీ అత‌నికి సీపీఆర్ చేసిన‌ట్లు వెల్ల‌డైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప‌త్రిక ఈ విష‌యాన్ని చెప్పింది.  డీనోకు  బ్రెట్‌లీ  సీపీఆర్ చేశార‌ని, ఆక్సిజ‌న్ తీసుకునే విధంగా డీన్ జోన్స్ కు బ్రెట్ లీ  సీపీఆర్ చేసిన‌ట్లు ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. 

బ్రెట్ లీ ఎంత ప్ర‌య‌త్నించినా.. డీన్ జోన్స్ లేవ‌లేక‌పోయారు.  వెంట‌నే అత‌న్ని స‌మీప ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. ఆ హాస్పిట‌ల్ వ‌ర్గాలు డీన్ జోన్స్ మృతిచెందిన‌ట్లు పేర్కొన్నాయి. అంబులెన్స్ రావ‌డానికి ముందు దాదాపు అర‌గంట సేపు బ్రెట్ లీ సీపీఆర్ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. డీన్ జోన్స్‌తో పాటు ట్రైడెంట్ హోట‌ల్‌లో కివీస్ మాజీ క్రికెట‌ర్ స్టైరిస్ కూడా ఉన్నారు. అత‌ను కూడా కామెంటేట‌రీ ప్యాన‌ల్‌లో ఉన్నాడు.  అయితే నిన్న ఉద‌యం డీన్‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేశాన‌ని, అంత‌కుముందు ఉద‌యం అత‌ను హాట‌ల్ లాన్‌లో జాగింగ్ చేసిన‌ట్లు స్టైరిస్ చెప్పాడు.