గురువారం 03 డిసెంబర్ 2020
Sports - May 06, 2020 , 16:52:38

బిగ్​బాష్​లో కివీస్ జట్టు కూడా ఉండాలి: మెక్​కలమ్

బిగ్​బాష్​లో కివీస్ జట్టు కూడా ఉండాలి: మెక్​కలమ్

అక్లాండ్​: ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్​బాష్ లీగ్​(బీబీఎల్​)లో తమ దేశం నుంచి ఓ జట్టు ఉండాలని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్​కలమ్ అన్నాడు. దీనిద్వారా టోర్నీపై మరింత ఆసక్తి పెరుగుతుందని ఎస్​ఈఎస్ రేడియోకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. “బిగ్​బాష్ లీగ్​కు కాస్త ఆదరణ తగ్గుతున్నది. న్యూజిలాండ్​కు చెందిన జట్టును లీగ్​లోకి తీసుకునేందుకు ఇది మంచి సమయం. అలాగే కివీస్ ఆటగాళ్లను లోక్​ల్ ప్లేయర్లుగానూ వేరే జట్లలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే విదేశీ ప్లేయర్లు టోర్నీ కోసం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది” అని మెక్​కలమ్​ అభిప్రాయపడ్డాడు. 2019-20 బిగ్​బాష్ లీగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసిన సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ కారణంగా సెప్టెంబర్​ 30వ తేదీ వరకు దేశ సరిహద్దులను ఆస్ట్రేలియా మూసివేయడంతో.. ఆ దేశంలో అక్టోబర్​లో ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.