శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 05, 2020 , 01:39:15

హెలీప్యాడ్‌పై శిక్షణ.. నేషనల్స్‌కు ఎంపిక

హెలీప్యాడ్‌పై శిక్షణ.. నేషనల్స్‌కు ఎంపిక

రాయ్‌పూర్‌: ఉంటున్నది నక్సల్‌ ప్రభావిత ప్రాంతం.. ప్రాక్టీస్‌ చేసేందుకు సౌకర్యాలు అంతంత మాత్రం.. హెలీప్యాడ్‌పైనే హాకీ ట్రైనింగ్‌.. అయినా ఆ తొమ్మిది మంది అమ్మాయిలు లక్ష్యం వైపుగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జాతీయ జూనియర్‌ నేషనల్స్‌ హాకీ ట్రయల్‌ క్యాంపునకు ఎంపికయ్యారు. యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్‌ కోసం కొండాగావ్‌ జిల్లాలో ఉన్న ఇండో-టిబెటెన్‌ సరిహద్దు పోలీసు(ఏటీబీపీ) దళం వద్ద ఈ తొమ్మిది మంది అమ్మాయిలు నాలుగేండ్లుగా హెలీప్యాడ్‌పైనే శిక్షణ తీసుకుంటున్నారు. 14-17ఏండ్ల మధ్య గల ఆ యువ కెరటాలు ఇప్పుడు భారత సబ్‌జూనియర్‌, జూనియర్‌ జాతీయ ట్రయల్‌ క్యాంపునకు సెలెక్ట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ అమ్మాయిలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించగలరని వారి కోచ్‌, ఐటీబీపీ హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్య సమిత్‌ తెలిపారు. సరైన హాకీ మైదానం కోసం కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కోరామని అన్నారు.