గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 22, 2020 , 23:20:12

కెరీర్‌పై కన్నేయండి

 కెరీర్‌పై కన్నేయండి

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరోనా వైరస్‌ వల్ల ఆట నుంచి దొరికిన విరామంలో కెరీర్‌ గురించి ఆత్మపరిశీలన చేసుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా తయారయ్యేందుకు వినియోగించుకోవాలని ఆటగాళ్లకు వెస్టిండీస్‌ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ సూచించాడు. కెరీర్‌లో ప్రస్తుతం వ్యక్తిగతంగా ఏ దశలో ఉన్నారో, భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించాలని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో సూచించాడు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని విండీస్‌ మాజీ ఆటగాడు చంద్రపాల్‌ అభిప్రాయపడ్డాడు.  logo
>>>>>>