రియోడీజెనీరో: కోపా అమెరికా కప్లో బ్రెజిల్ గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం పెరూతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 4-0 తో ఘన విజయం సాధించింది. అలెక్స్ సాండ్రో (12ని), నెయ్మార్ (68ని), ఎవర్టన్ రిబిరో (89ని), రిచర్లీసన్ (90+ 3ని) గోల్స్ నమో దు చేశారు. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకు న్న బ్రెజిల్.. పూల్-ఎలో టాప్లో కొనసాగుతున్నది.