ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 20, 2020 , 17:40:01

అంబ‌టికి ఆగ్ర‌హ‌మెక్కువ‌: బ‌్రేవో

అంబ‌టికి ఆగ్ర‌హ‌మెక్కువ‌: బ‌్రేవో

న్యూఢిల్లీ:  తెలుగు ఆట‌గాడు అంబ‌టి తిరుప‌తి రాయుడును కావాల‌నే రెచ్చ‌గొట్టేవాడిన‌నా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు స‌హ‌చ‌రుడు డ్వేన్ బ్రేవో వెల్ల‌డించాడు. భార‌త ఆట‌గాళ్ల‌లో రాయుడు అంటే త‌న‌కు ప్ర‌త్యేక అభిమాన‌మ‌ని కానీ ప‌దే ప‌దే అత‌డిని ఆట‌ప‌ట్టించేవాడిన‌ని బ్రేవో పేర్కొన్నాడు. ఈ ఇద్ద‌రు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ధోనీ సార‌థ్యంలోని చెన్నైకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

`నాకిష్ట‌మైన భార‌త ఆట‌గాళ్ల‌లో అంబ‌టి రాయుడు ఒక‌డు. ఇంత‌కుముందు ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున కూడా మేమిద్ద‌రం క‌లిసే ఆడాం. అత‌డికి కాస్త కోపం ఎక్కువ‌. అందుకే త‌ర‌చూ అత‌డిని రెచ్చ‌గొట్టేవాడిని. నువ్వు మంచి ఆట‌గాడివి కాదు. నీకు బ్యాటింగే రాదు. అస‌లు చెన్నై నిన్నేందుకు కొనుగోలు చేసిందో.. అంటో అత‌డిని ఆట‌ప‌ట్టించేవాడిని. నా మాట‌లు అబద్ధాల‌ని నిరూపించేందుకు అత‌డు మైదానంలో వంద శాతం కృషిచేసేవాడు. అలా అత‌డు రాణించిన ప్ర‌తీసారి నేను చాలా ఆనంద‌ప‌డేవాడిని. అత‌డి గురించి నాకు పూర్తిగా తెలుసుకాబ‌ట్టే ఆలా చేసేవాడిని. ద‌గ్గ‌ర నుంచి ప‌రిశీలించిన వార‌కే రాయుడు మంచిత‌న‌మేంటో తెలుస్తుంది`అని బ్రేవో అన్నాడు. 2018లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మారిన అంబ‌టి టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగి అద‌ర‌గొట్టాడు. సీజ‌న్‌లో 602 ప‌రుగులు సాధించి టీమ్ఇండియాలో పున‌రాగ‌మ‌నం చేసిన విష‌యం తెలిసిందే.logo