మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 30, 2020 , 08:02:24

ధోనిపై పాట రూపొందించిన బ్రావో

ధోనిపై పాట రూపొందించిన బ్రావో

ముంబై : జూలై 7న మహేంద్రసింగ్‌ ధోని పుట్టిన రోజు. ఈ సందర్భంగా వెస్టిండిస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ధోనిపై హెలికాఫ్టర్‌ పాటను రూపొందించాడు. బ్రావోకు ధోని అంటే చాలా ఇష్టం. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో ఈ ఇద్దరు ఎన్నో విజయాలు సాధించారు. అంతే కాదు బ్రావో మంచి గాయకుడు. డ్యాన్సర్‌ కూడా. అతను ధోనిపై హెలికాఫ్టర్‌ పాటను రూపొందించి ధోనికి అంకితమివ్వనున్నాడు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశాడు.

‘మహీ పుట్టిన రోజు వేడుకను మేమంతా ఛాంపియన్‌ టీం రూపొందించిన ప్రత్యేకమైన పాటతో జరుపుకోబోతున్నాం. గాయ్స్‌ మమ్మల్ని ట్యాగ్‌ చేయడం మర్చిపోవద్దు. మీ హెలికాఫ్టర్‌ డ్యాన్స్‌ చూడనివ్వండి’ అంటూ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాటకు సంబంధించిన ట్రీజర్‌ వీడియోను షేర్‌ చేశాడు. త్వరలోనే పూర్తి పాటను విడుదల చేస్తానని తెలిపాడు.

https://www.instagram.com/p/CCATXIMn_Va/?utm_source=ig_web_button_share_sheet


logo