మంగళవారం 14 జూలై 2020
Sports - Apr 13, 2020 , 20:26:07

ఫీల్డింగ్‌లో జ‌డ్డూనే బెస్ట్‌: బ‌్రాడ్ హాగ్‌

ఫీల్డింగ్‌లో జ‌డ్డూనే బెస్ట్‌: బ‌్రాడ్ హాగ్‌

సిడ్నీ:  టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్న‌ర్ బ్రాడ్ హ‌గ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. జ‌డ్డూ అత్యుత్త‌మ ఫీల్డ‌ర్ అని కొనియాడాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీలన్నీ ర‌ద్దుకావ‌డంతో.. ఆట‌గాళ్లంతా సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ త‌రుణంలో భార‌త ఫీల్డ‌ర్ల‌లో ఎవ‌ర‌నే బ్రాడ్ హ‌గ్‌కు ఎదురుకాగా.. అత‌డు జ‌డ్డూకు ఓటేశాడు.

`విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్‌, సురేశ్ రైనా, ర‌వీంద్ర జ‌డేజా.. ఈ న‌లుగురు అత్యుత్త‌మ ఆట‌గాళ్లే. ఈ న‌లుగురు స‌ర్కిల్ లోప‌ల ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో బౌలింగ్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతా. కానీ అంద‌రిలో ఒక‌రినే ఎంపిక చేయ‌మంటే మాత్రం జ‌డేజానే నా చాయిస్‌` అని హ‌గ్ అన్నాడు.


logo