ఆదివారం 17 జనవరి 2021
Sports - Nov 30, 2020 , 21:21:52

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ముథోల్‌: నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని బోరిగాం గ్రామంలో ఇంటి ముందట ఉన్న నీటి తొట్టిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మి, ఎల్లప్ప దంపతులకు ముగ్గురు సంతానం. వీరి చిన్న కొడుకు గంగాధర్‌(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు, బయటకు తీసి భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి, బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.