ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 16:59:19

స్పెషల్‌ టీమ్‌..స్పెషల్‌ విన్‌: ఫొటోలు

స్పెషల్‌ టీమ్‌..స్పెషల్‌ విన్‌: ఫొటోలు

మెల్‌బోర్న్‌: రెండో టెస్టులో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ ఆజింక్య రహానె  క్లిష్టపరిస్థితుల్లో  అత్యుత్తమ ఇన్నింగ్స్‌ తో మెరవడం,  బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించడంతో ఆసీస్‌ గడ్డపై భారత్‌ చిరస్మరణీయ విజయాన్నందుకుంది.   రహానె సెంచరీ(112)తో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 131 పరుగుల విలువైన ఆధిక్యం సంపాదించింది. అరంగేట్ర టెస్టులోనే యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు.   

టెస్టులో కొంతమంది ఆటగాళ్లు గొప్ప పోరాటపటిమ కనబర్చారు. అడిలైడ్‌ ఘోర పరాభవం నుంచి  గట్టిగా పుంజుకున్న భారత్‌ ఆతిథ్య జట్టుకు బాక్సింగ్‌ డే టెస్టులో అదిరే పంచ్‌ ఇచ్చింది. టెస్టు మ్యాచ్‌ అనంతరం ఈ గెలుపులో భాగస్వాములైన ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా తమ అనుభవాలను  పంచుకున్నారు.  logo