బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

హుసాముద్దీన్‌కు పతకం ఖాయం

హుసాముద్దీన్‌కు పతకం ఖాయం
  • నిఖత్‌ జరీన్‌ ఔట్‌

న్యూఢిల్లీ: సోఫియా(బల్గేరియా) వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మెమోరియల్‌ టోర్నీలో తెలంగాణ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ పతకం ఖాయం చేసుకున్నాడు.  టోర్నీలో గురువారం జరిగిన పురుషుల 57కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో అతడు 5-0తేడాతో కుర్ట్‌ వాకర్‌(ఐర్లాండ్‌)ను చిత్తు చేశాడు. పోటీ ఆసాంతం పదునైన పంచ్‌లు కురిపించిన తెలంగాణ బాక్సర్‌ ప్రత్యర్థిని సునాయాసంగా పడగొట్టి పతక పోరులో ప్రవేశించాడు. మహిళల క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, తెలంగాణ యువ కెరటం నిఖత్‌ జరీన్‌(51కేజీలు) 2-3తేడాతో క్రిస్టినా క్రజ్‌(అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది టోర్నీలో నిఖత్‌ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల క్వార్టర్స్‌లో శివథాపా(63కేజీలు) విజ  సాధించగా.. మహిళల పోటీలో సోనియా లాథర్‌(57కేజీలు) 3-2తేడాతో మిచెలా వాల్ష్‌(ఐర్లాండ్‌)పై గెలిచి సెమీఫైనల్‌ చేరింది. logo
>>>>>>