మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 01, 2020 , 03:31:43

సచిన్‌తో పోరును ఆస్వాదించేవాడిని:లీ

సచిన్‌తో పోరును ఆస్వాదించేవాడిని:లీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు, తనకు మధ్య పోటీ ఎప్పుడూ హోరాహోరీగా సాగేదని అతడికి బౌలింగ్‌ చేయడాన్ని ఎంతో ఆస్వాదించేవాడినని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ గుర్తు చేసుకున్నాడు. తనలోని అత్యుత్తమ బౌలింగ్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ బయటకు తెచ్చేవాడని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో లీ అన్నాడు. ‘ఆటలో ఎప్పుడూ టాప్‌లో ఉండాలనే నేను తపన పడేవాడిని. అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్‌ చేయాలంటే నేను బెస్ట్‌గా ఉండాలి. నాలోని అత్యుత్తమ బౌలింగ్‌ను సచిన్‌ వెలికితీసేవాడు’ అని బ్రెట్‌ లీ అన్నాడు. 


logo