సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 28, 2020 , 02:29:57

రష్యన్‌ రేస్‌ విజేత బొటాస్‌

రష్యన్‌ రేస్‌ విజేత బొటాస్‌

సోచీ: రష్యన్‌ గ్రా ండ్‌ప్రి టైటిల్‌ను మె ర్సిడెజ్‌ రేసర్‌ వాల్తెరి బొటాస్‌ కైవసం చేసుకున్నాడు. ఫార్ములా వన్‌ ఆల్‌టైం గ్రేట్‌ షూమాకర్‌ అత్యధిక టైటిళ్ల (91) రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో రేస్‌లో అడుగుపెట్టిన బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేస్‌ను పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించిన మెర్సిడెజ్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ప్రాక్టీస్‌ స్టార్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి రెండు సార్లు 5 సెకన్ల పెనాల్టీలకు గురై వెనుకబడ్డాడు. ఆ జట్టుకే చెందిన బొటాస్‌ అందరి కన్నా వేగంగా గమ్యాన్ని చేరి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. అతడి కంటే ఏడు సెకన్లు ఆలస్యమైన రెడ్‌బుల్‌ రేసర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంలో నిలిచాడు.logo