గురువారం 09 జూలై 2020
Sports - Apr 13, 2020 , 21:43:42

ఇలా దూరం దూరంగా ఉండండి: బోల్ట్

ఇలా దూరం దూరంగా ఉండండి: బోల్ట్

ఇలా దూరం దూరంగా ఉండండి: బోల్ట్

జ‌మైకా: స‌్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్..అంద‌రిని ఆలోచింపజేసే ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. క‌రోనా వైర‌స్ అంతకంత‌కు విస్త‌రిస్తున్న నేపథ్యంలో అంద‌రూ నిర్ణీత దూరం పాటించాలంటూ  త‌న‌దైన శైలిలో సూచించాడు. స‌రిగ్గా 12 ఏండ్ల క్రితం బీజింగ్‌లో జ‌రిగిన ఒలింపిక్స్‌లో బ‌రిలోకి దిగిన ఈ జ‌మైక‌న్ చిరుత 100మీటర్ల‌, 200 మీట‌ర్ల రేసుల్లో ప్ర‌పంచ‌, ఒలింపిక్ రికార్డులు నెల‌కొల్పాడు. 

త‌న‌కు తిరుగులేని వంద మీట‌ర్ల రేసును రికార్ఢు స్థాయిలో 9.69 సెక‌న్ల‌లో ముగించి  ఔరా అనిపించాడు. ఈ ప‌రుగులో అమెరికా అథ్లెట్ రిచ‌ర్డ్ థాంప్స‌న్‌ను 0.20 సెక‌న్ల తేడాతో అధిగ‌మించి బోల్ట్ పసిడి ప‌త‌కాన్ని ముద్దాడాడు. ల‌క్ష్యాన్ని ఇంకా చేరుకోక‌ముందే..చాతిపై చేతితో బాదుతూ సంబురాల్లో మునిగిపోయాడు.  నేడు కొవిడ్-19తో అత‌లాకుత‌ల‌మవుతున్న ప్ర‌పంచ దేశాల‌కు సందేశ‌మిచ్చే విధంగా ఇలా దూరం దూరంగా ఉండండి హ్యాపీ ఈస్ట‌ర్ అంటూ అనాటి ఫొటోను ట్వీట్ చేశాడు. బోల్ట్ త‌న కెరీర్‌లో 100 మీట‌ర్ల రేసులో ఆరు  ఒలింపిక్ స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకోవడం విశేషం. 


logo