ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 02, 2021 , 03:48:29

17న బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌

17న బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ‘కేసీఆర్‌ కప్‌' పేరిట సాట్స్‌ నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ పోస్టర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. సోమవారం నగరంలోని తన కార్యాలయంలో సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి మంత్రి పోస్టర్లను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ మిస్టర్‌ యూనివర్స్‌లు మోతెశామ్‌ అలీ, ఎం.రాజు యాదవ్‌, బాడీ బిల్డింగ్‌ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొరబోయిన విజయ్‌, సెక్రటరీ హరిసింగ్‌, ఎవోలెట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ విద్యాసాగర్‌, సంతోష్‌, దేవేందర్‌ యాదవ్‌, అబ్దుల్‌ వాహబ్‌, అబ్దుల్‌ వదూద్‌, బాడీ బిల్డింగ్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ మిస్టర్‌ తెలంగాణ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది. 


VIDEOS

logo