గురువారం 09 జూలై 2020
Sports - Apr 23, 2020 , 10:45:12

ఇలా అయితే క‌ష్ట‌మే: ర‌మీజ్ రాజా

ఇలా అయితే క‌ష్ట‌మే: ర‌మీజ్ రాజా

లాహోర్‌:  టోర్న‌మెంట్‌లు నిర్వ‌హించ‌కుంటే క్రికెట్ బోర్డుల మ‌నుగ‌డ క‌ష్ట సాధ్య‌మ‌ని పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు ర‌మీజ్ రాజా పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఇది క్లిష్ట స‌మ‌య‌మ‌ని ఇలాగే కొన‌సాగితే బోర్డు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా క‌ష్ట‌మైపోతుంద‌ని ఆయ‌న అన్నారు. దీంతో పాటు ప్రేక్ష‌కుల్లేకుండానైనా మ్యాచ్‌లు నిర్వ‌హించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇత‌ర దేశాల‌తో చ‌ర్చ‌లు సాగిస్తే మంచిద‌ని ఆయ‌న సూచించారు.

`కొవిడ్‌-19 కారణంగా క్రీడాలోకం మొత్తం స్తంభించిపోయింది. ఇలాగే ఉంటే ఉద్యోగుల‌కు జీతాలివ్వ‌డం కూడా బోర్డుల‌కు క‌ష్ట‌మ‌వుతుంది. అది చాలా దుర్భ‌ర స్థితి. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదాయం పెంచుకునే దిశ‌గా ఆలోచించాలి. అవ‌స‌ర‌మైతే ఇత‌ర బోర్డుల‌తో చ‌ర్చించాలి` అని ఆయ‌న సూచించారు.


logo