శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 25, 2020 , 00:36:00

చైర్మన్‌ ఎన్నికపై స్పష్టత వచ్చేనా! నేడు ఐసీసీ కీలక సమావేశం

చైర్మన్‌ ఎన్నికపై స్పష్టత వచ్చేనా! నేడు ఐసీసీ కీలక సమావేశం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొత్త చైర్మన్‌ నామినేషన్‌ ప్రక్రియపై గురువారం నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. ఐసీసీ సభ్యదేశాలతో నేడు జరుగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేషన్‌పై ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌పై వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఐసీసీ.. ఎన్నికల అంశంపై చర్చించనుంది. అయితే ఎలక్షన్‌ తేదీని ప్రకటించే అవకాశాలు దాదాపుగా లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగియగా.. ఎక్స్‌టెన్షన్‌కు ఆయన అంగీకరించకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. మొన్నటి వరకు ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్‌ గ్రోవర్‌ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు కనిపించినా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మనీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


logo