గురువారం 09 జూలై 2020
Sports - May 05, 2020 , 00:07:43

క్రికెట్​కు పరిమితమవ్వాల్సిందే: ఫించ్

క్రికెట్​కు పరిమితమవ్వాల్సిందే: ఫించ్

వరుసగా డ్యాన్స్ వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్​ వార్నర్​ అదరగొడుతుండగా.. ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా​ ముందుకొచ్చాడు.  తాను డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఫించ్ ఆత్మవిశ్వాసంతో చిందేయలేకపోయాడు. ఈ వీడియోను సరదాగా ఎడిట్ చేసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. ఇంత ప్రయత్నించినా తనకు డ్యాన్స్ చేయడం రావడం లేదని, ఇక క్రికెట్​కే పరిమితమైతే మేలేమో అనేలా క్యాప్షన్ పెట్టాడు. ‘30రోజులుగా టిక్​టాక్​ యాప్​లో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇక నేను క్రికెట్​కే పరిమితం కావొచ్చు’ అని ఫించ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా పోటీలన్నీ నిలిచిపోవడంతో క్రికెటర్లందరూ ఇండ్లలోనే ఉంటూ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ డ్యాన్స్​తో పాటు వారి ఇతర టాలెంట్​లను బయటపెడుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.


logo