సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 05, 2020 , 22:31:41

రైనాకు స‌న్నీ భ‌రోసా..

రైనాకు స‌న్నీ భ‌రోసా..

ప‌ఠాన్‌కోట్‌:  టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు సురేశ్ రైనా బంధువుల‌పై జ‌రిగిన దాడి విష‌యంలో వీలైనంత త్వ‌ర‌గా న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని లోక్‌స‌భ ఎంపీ, బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ అన్నాడు. ప‌ఠాన్‌కోట్ స‌మీపంలో గ‌త నెల‌లో రైనా బంధువుల‌పై గుర్తుతెలియ‌ని దుండ‌గులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో రైనా మామ‌య్య మృతి చెంద‌గా.. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న రైనా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ ఆడేందుకు యూఏఈ వెళ్లి అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చాడు. 

దాడి జ‌రిగిన ప్రాంతం స‌న్నీ డియోల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోది కావ‌డంతో ఈ అంశంపై దృష్టి సారించిన అత‌డు.. జిల్లా ఎస్పీతో స‌మావేశం అయ్యాడు. రైనా బంధువుల‌పై జ‌రిగిన దాడీ ఘ‌ట‌న గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకున్నాడు. అనంత‌రం స‌న్నీ మాట్లాడుతూ.. `ప‌ఠాన్‌కోట్ ఎస్పీ గుల్‌నీత్ సింగ్ ఖురానాతో ఈ అంశంపై చ‌ర్చించా. దాడికి సంబంధించిన విష‌యాలు అడిగి తెలుసుకున్నా. దీంతోపాటు భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించా` అని అన్నాడు.

logo