సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 09, 2020 , 22:30:51

చెలరేగుతున్న బిష్ణోయ్‌.. ఒత్తిడిలో బంగ్లా

చెలరేగుతున్న బిష్ణోయ్‌.. ఒత్తిడిలో బంగ్లా

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ తుదిపోరు రసవత్తరంగా సాగుతోంది. సెన్వెస్‌ పార్క్‌లోని పోచెఫ్‌స్ట్రూమ్‌ మైదానంలో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో  భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. కాగా, 178 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా ఆరంభం నుంచి లక్ష్యం దిశగా సాగింది. తొలి వికెట్‌కు పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌(25), తాంజిద్‌ హసన్‌(17) 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి,  జట్టుకు శుభారంభాన్నిచ్చారు. కాగా, ఇక్కడి నుంచే భారత స్పిన్‌ సంచలనం రవి బిష్ణోయ్‌ ప్రతాపం మొదలైంది. మొదట తాంజిద్‌ హసన్‌ను పెవిలియన్‌ పంపిన రవి.. తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం తన తదుపరి ఓవర్లో హసన్‌ రాయ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 62 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఒత్తిడిలో పడింది. తదనంతరం, బిష్ణోయ్‌ తన వరుస ఓవర్లలో తొహ్విద్‌ హృదయ్‌(0), షబాదత్‌(1) ఔట్‌ చేసి బంగ్లాను మరింత ఒత్తిడిలో పడేశాడు. షహదత్‌ను వికెట్‌కీపర్‌ ధృవ్‌ అద్భుతంగా స్టంపౌట్‌ చేశాడు. 50-1తో పటిష్టంగా ఉన్న బంగ్లా 65-4తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నాలుగు వికెట్లు రవి బిష్ణోయ్‌ పడగొట్టడం విశేషం. షాహిమ్‌ హొసేన్‌ను సుశాంత్‌ మిశ్రా బొల్తా కొట్టించాడు. ప్రస్తుతం బంగ్లా 20.2 ఓవర్లలో 85-5తో నిలిచింది. క్రీజులో కెప్టెన్‌ అక్బర్‌ అలీ(9), అవిశేక్‌ దాస్‌(0) ఉన్నారు. 


logo