ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 18, 2020 , 00:01:42

బయో బబుల్‌ బెటర్‌

బయో బబుల్‌ బెటర్‌

 న్యూఢిల్లీ: జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరాన్ని బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహించాలనే వాదనలు ఎక్కువవుతున్నాయి. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఆగస్టు 8న గోపీచంద్‌ అకాడమీలో ప్రభుత్వ అనుమతులతో శిక్షణ శిబిరం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అందులో పాల్గొన్న డబుల్స్‌ ప్లేయర్‌ ఎన్‌. సిక్కిరెడ్డితో పాటు ఫిజియో కిరణ్‌కు మొదట కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత రెండోసారి పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆటగాళ్ల రక్షణను దృష్టిలోపెట్టుకొని బయో సెక్యూర్‌ వాతావరణంలో క్యాంప్‌ నిర్వహించాలని మాజీ జాతీయ చాంపియన్‌ అరవింద్‌ భట్‌ అన్నాడు. పీవీ సింధు తండ్రి, ఆసియా క్రీడల పతక విజేత రమణ మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ వచ్చే వరకు మరింత జాగ్రత్త అవసరం. సాయ్‌ ఎస్‌వోపీ ప్రకారం ముందుకు సాగితే మంచిది. ఒక ప్లేయర్‌ ప్రాక్టీస్‌ చేశాక అరగంట తర్వాత మరో ప్లేయర్‌ను అనుమతించాలి. లేకపోతే ఒక్కో ప్లేయర్‌కు ఒక్కో కోచ్‌ను కేటాయించాలి’ అని అన్నారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ ఇటీవల శిబిరాన్ని సందర్శించి.. తగు సూచనలు చేసిన విషయం తెలిసిందే. 


logo