ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 14, 2020 , 00:40:48

కష్టాల్లో హైదరాబాద్‌

కష్టాల్లో హైదరాబాద్‌

-ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 489/8 డిక్లేర్డ్‌ .. హైదరాబాద్‌ ప్రస్తుతం 45/3 

ఒంగోలు: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన హైదరాబాద్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్‌ మరోసారి విఫలమవడంతో ఇన్నింగ్స్‌ ఓటమి ప్రమాదంలో పడింది. 264 పరుగుల లోటుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌.. 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్న మన జట్టు  ఇంకా 219 పరుగుల వెనుకబడి ఉంది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (20), జావీద్‌ అలీ (16) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి (4), మల్లికార్డున్‌ (2), హిమాలయ్‌ అగర్వాల్‌ (0) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 237/1తో సోమవారం ఆట కొనసాగించిన ఆంధ్ర 489/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. సెంచరీ హీరో ప్రశాంత్‌ (119) ఎక్కువసేపు నిలువకున్నా.. కరణ్‌ షిండే (94), రికీ భుయ్‌ (69), కెప్టెన్‌ హనుమ విహారి(55) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో మోహదీ హసన్‌ మూడు, రవికిరణ్‌, మిలింద్‌ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 225 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. మరో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ జలజ్‌ సక్సేనా (7/51) చెలరేగడంతో పంజాబ్‌పై కేరళ 21 పరుగుల తేడాతో గెలిచింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో పంజాబ్‌ 124 పరుగులకే కుప్పకూలింది. 


logo