బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:39:48

ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త

 ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరి సహకారం అవసరమని భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ పిలుపునిచ్చాడు. తప్పుడు వార్తల (ఫేక్‌ న్యూస్‌) ఉచ్చులో పడకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశాడు. ‘ప్రస్తుతం ప్రపంచమంతా కొవిడ్‌-19 మహమ్మారిపై యుద్ధం చేస్తున్నది. ఇలాంటి సమయాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలుగుతూ.. ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడాలి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పాటిస్తూ.. తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్నవారికి కూడా వైరస్‌పై అవగాహన కల్పించాలి’ అని పేస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.


logo