గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 02:18:37

స్టోక్స్‌ దూరం

 స్టోక్స్‌ దూరం

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరమయ్యాడు. కుటుంబ కారణాల వల్ల అతడు మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఆదివారం వెల్లడించింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు అతడు న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడని తెలిపింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో స్టోక్స్‌ తల్లిదండ్రులు ఉంటున్నారు. కాగా పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. 


logo