ఆదివారం 05 జూలై 2020
Sports - Jul 01, 2020 , 00:55:14

తొలి టెస్టుకు కెప్టెన్‌గా స్టోక్స్‌

తొలి టెస్టుకు కెప్టెన్‌గా స్టోక్స్‌

లండన్‌: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుకు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ సారథ్యం వహించనున్నాడు. సౌతాంప్టన్‌ వేదికగా జూలై 8వ తేదీ నుంచి తొలి టెస్టు జరుగనుండగా.. అదే సమయంలో తన భార్య రెండో సంతానానికి జన్మనివ్వనుండడంతో రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో స్టోక్స్‌ కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్టు ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఆల్‌రౌండర్‌గా గతేడాది వన్డే ప్రపంచకప్‌, యాషెస్‌లో అదరగొట్టిన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ జట్టుకు సారథ్యం వహించడం ఇదే తొలిసారి కానుంది. కాగాజట్టుకు కెప్టెన్‌గా ఉన్నా తన ఆటతీరు, శైలిలో ఏ మార్పు ఉండదని స్టోక్స్‌ అన్నాడు. తాను నిరంతరం సానుకూల దృక్పథంతోనే ఉంటానని  ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.    


logo