బుధవారం 20 జనవరి 2021
Sports - Jul 14, 2020 , 01:02:01

నా ఆటతీరు మారదు: స్టోక్స్‌

నా ఆటతీరు మారదు: స్టోక్స్‌

జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టినా ఆటగాడిగా తనలో ఎలాంటి మార్పు ఉండదని, మునుపటిలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలనని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. విండీస్‌తో తొలి టెస్టుకు జో రూట్‌ దూరమవడంతో ఇంగ్లండ్‌ జట్టుకు స్టోక్స్‌ కెప్టెన్సీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా ఆడడంతో విమర్శలు వచ్చాయి. దీనిపై స్టోక్స్‌ స్పందించాడు. సారథి అయినంత మాత్రనా తన ఆట ఏ మాత్రం మారదని స్పష్టం చేశాడు. అలాగే ఈ మ్యాచ్‌కు సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను తీసుకోకపోవడంపై చింతించడం లేదని అన్నాడు. జట్టు సమీకరణాలు, మ్యాచ్‌ పరిస్థితుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని స్టోక్స్‌ చెప్పాడు.


logo