శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 15:33:47

SRH vs RR: ఆశలన్నీ బెన్‌స్టోక్స్‌పైనే !

SRH vs RR: ఆశలన్నీ  బెన్‌స్టోక్స్‌పైనే !

దుబాయ్:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ మార్పులతో బరిలో దిగుతోంది. రియాన్‌ పరాగ్‌, రాబిన్‌ ఉతప్పలకు మరోసారి అవకాశమిచ్చారు. ఆండ్రూ టై, యశస్వి జైశ్వాల్‌, మహిపాల్‌  లామ్రోర్‌లను  జట్టు నుంచి తప్పించారు.  సీనియర్‌ పేసర్‌ వరున్‌ అరోన్‌ స్థానంలో జయదేవ్‌ ఉనద్కత్‌ను మళ్లీ  తీసుకున్నారు.  సీజన్‌ ఆరంభం నుంచి రాజస్థాన్‌  రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షిస్తూనే ఉంది.  

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఘోర ఓటములను  ఎదుర్కొన్న రాజస్థాన్‌ గెలుపుబాట పట్టాలని  భావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజస్థాన్‌ ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లకు దూరమైన బెన్‌స్టోక్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.  యూఏఈ పిచ్‌లపై స్టోక్స్‌ ఎలా  ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. అంచనాలను అందుకోలేక  ఇప్పటిదాకా  రాజస్థాన్‌ జట్టు బౌలింగ్‌.. బ్యాటింగ్‌.. రెండింట్లోనూ విఫలమై మూల్యం చెల్లించుకుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌  బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.