లండన్: టీ20 వరల్డ్‌కప్ కోసం గురువారం టీమ్‌ను ప్రకటించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు టీమ్‌లో చోటు దక్కలేదు. మరోవైపు టైమల్ మిల్స్‌ను తిరిగి టీమ్‌లోకి తీసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకున్న విషయం తెలిసిందే. దీని కారణంగానే ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. జులైలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ కోసం టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా.. ఆ తర్వాత తాను క్రికెట్‌కు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌కు కూడా దూరం కావడం ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బే. అటు స్టార్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా టీమ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో టైమల్ మిల్స్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.
ఇంగ్లండ్ టీమ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జొనాథన్ బెయిర్‌స్టో, శామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.