గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 16:16:44

చెన్నైలో క్వారంటైన్‌లో బెన్‌స్టోక్స్‌

చెన్నైలో క్వారంటైన్‌లో బెన్‌స్టోక్స్‌

చెన్నై: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ చెన్నై చేరుకున్నాడు. భారత్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం స్టోక్స్‌ భారత్‌కు వచ్చాడు. కరోనా కారణంగా స్టోక్స్‌ నగరంలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు. మొదటి రోజు గడిచిపోయింది. మిగతా  ఐదు రోజులను ఎలా గడపాలనేదానిపై తన కార్యాచరణ ప్రణాళికను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాడు.  

భారత్‌, ఇంగ్లాండ్‌  మధ్య టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఆరంభంకానుంది. లంక పర్యటనను ముగించుకున్న ఇంగ్లాండ్‌ జట్టు బుధవారం చెన్నై వచ్చే అవకాశం ఉంది. జట్టు సభ్యులంతా ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ ప్రారంభించనున్నారు. శ్రీలంకతో టెస్టులకు బెన్‌స్టోక్స్‌, పేసర్‌ ఆర్చర్‌ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ భారత్‌తో టెస్టుల కోసం తిరిగి జట్టుతో చేరనున్నారు. 

VIDEOS

logo