బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 14:44:35

టెస్టుల్లో బెన్‌స్టోక్స్‌ మరో రికార్డు

టెస్టుల్లో  బెన్‌స్టోక్స్‌ మరో రికార్డు

సౌతాంప్టన్‌:  వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ అరుదైన ఘనత సాధించాడు.  విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌( 4/49) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.  మూడో రోజు  ఆటలో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ అల్జారీ జోసెఫ్‌ను స్టోక్స్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.  టెస్టుల్లో స్టోక్స్‌కు ఇది 150వ వికెట్‌ కావడం విశేషం.  టెస్టుల్లో వేగంగా 4వేల పరుగులు, 150 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బెన్‌స్టోక్స్‌ నిలిచాడు.  

స్టోక్స్‌ 64 టెస్టుల్లో  ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌ లెజెండ్‌ గ్యారీ సోబర్స్‌ 63 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకొని టాప్‌లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో  ఇప్పటి వరకు 4వేల రన్స్‌, 150 వికెట్లు తీసిన ఆటగాళ్లు కేవలం ఆరుగురే.  ఇయాన్‌ బోథమ్‌, కపిల్‌ దేవ్‌,  జాక్వెస్‌ కలిస్‌, డేనియల్‌ వెటోరీ మాత్రమే ఈ ఫీట్‌ అందుకున్నారు.  


logo