దుబాయ్: వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్న క్రిస్ వోక్స్ స్థానంలో ఆస్ట్రేలియా ఎడమచేతివాటం పేసర్ బెన్ ద్వారుశిస్ను జట్టులోకి తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తెలిపింది. ఈనెల 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ రెండో దశ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బెన్ను డీసీ జట్టులోకి తీసుకుంది. 27 ఏండ్ల బెన్.. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్ తరఫున బరిలోకి దిగాడు. బిగ్‌బాష్‌లో ఆడిన 69 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు(89) తీసిన ఆరో బౌలర్‌గా బెన్ తన పేరిట రికార్డు లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులోనూ సభ్యుడు.