శుక్రవారం 29 మే 2020
Sports - Apr 10, 2020 , 18:24:10

ఇదొక్క‌టే మార్గం: రోహిత్ శ‌ర్మ‌

ఇదొక్క‌టే మార్గం:  రోహిత్ శ‌ర్మ‌

ముంబై: క్షేమంగా ఉండాలంటే ఇంటికి ప‌రిమితం కావాల్సిందే.. మ‌రో మార్గం లేద‌ని టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దైన విష‌యం తెలిసందే. దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన క్రీడాకారులు సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌ర‌చూ అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తున్నారు. 

`ఇంట్లో ఉండ‌టం త‌ప్ప వేరే మార్గం లేదు. ఇంట్లో ఉండండి.. ఫిట్‌గా ఉండండి.. సేఫ్‌గా ఉండండి` అని రోహిత్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాల్క‌నీలో కూర్చొని షూ లేస్ క‌ట్టుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇప్ప‌టికే టీమ్ఇండియా ఏస్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, మాజీ ఆల్‌రౌండ‌ర్ యువరాజ్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వ‌హించిన‌ హిట్‌మ్యాన్ తాజాగా అభిమానుల‌కు ఇంట్లోనే ఉండమ‌ని సూచించాడు.


logo