గురువారం 02 జూలై 2020
Sports - Apr 13, 2020 , 23:53:03

క‌రోనాకు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాం: మ‌ను భాక‌ర్

క‌రోనాకు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాం: మ‌ను భాక‌ర్

క‌రోనాకు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాం: మ‌ను భాక‌ర్ 

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లక ముందు మేమంతా మంచి ఫామ్‌లో ఉన్నామ‌ని భార‌త యువ షూట‌ర్ మ‌ను భాక‌ర్ అంది. టోక్యో ఒలింపిక్స్ అర్హ‌త కోసం జ‌రిగిన దాదాపు అన్ని ఈవెంట్ల‌లో మ‌న షూట‌ర్లు స‌త్తాచాటారు. ఇదే జోరును టోక్యో విశ్వ‌క్రీడ‌ల్లోనూ కొన‌సాగిద్దామ‌నుకున్నాం, కానీ కొవిడ్‌-19తో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. 

వైర‌స్ అంత‌కంత‌కు విస్త‌రిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్వ‌హ‌కులు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ను భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ ‘ క‌రోనాతో కొన్ని టోర్నీలు వాయిదా ప‌డుతాయ‌నుకున్నాను. కానీ ఒలింపిక్స్‌తో స‌హా అన్నింటి మీద దీని ప్ర‌భావం ప‌డింది. మేము ఇటీవ‌ల కాలంలో మంచి ఫామ్‌మీదున్నాం. ఎదురైన టోర్నీల్లో మ‌న‌వాళ్లు ప‌త‌కాలు కొల్ల‌గొట్టారు. ఇదే రీతిలో ఒలింపిక్స్‌లోనూ రాణించాల‌న్న ధీమాతో క‌నిపించాం. కానీ క‌రోనాతో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్ప‌డు ఆరోగ్యం కంటే మించిది లేదు. స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ప్రాక్టీస్ చేయ‌డం లేకున్నా..ఎక్క‌డి వారు అక్క‌డే త‌మ ప్ర‌తిభ‌కు ప‌దును పెట్టుకుంటున్నారు. మా ఇంట్లో షూటింగ్ రేంజ్ ఉన్నా..కోతుల వ‌ల్ల స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. వాటి వ‌ల్ల ప్రాక్టీస్‌కు అంత‌రాయం క‌ల్గుతున్న‌ది’ అని భాక‌ర్ అంది. 


logo