మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 00:53:35

ధోనీకి వీడ్కోలు మ్యాచ్‌!

ధోనీకి వీడ్కోలు మ్యాచ్‌!

న్యూఢిల్లీ:  టీమ్‌ఇండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ విషయంపై యూఏఈలో ఐపీఎల్‌ సమయంలో ధోనీతో బీసీసీఐ మాట్లాడుతుందని అన్నారు. ‘ప్రస్తుతానికి అంతర్జాతీయ సిరీస్‌లేమీ లేవు. ఐపీఎల్‌ తర్వాతే జరుగొచ్చు. దేశం కోసం ధోనీ ఎంతో చేశాడు. తగిన గౌరవాన్ని పొందేందుకు అతడు పూర్తి అర్హుడు. ధోనీ వీడ్కోలు మ్యాచ్‌ ఆడాలని మేం అనుకున్నాం. కానీ అతడు విభిన్నంగా ఆలోచిస్తాడు. రిటైర్మెంట్‌ గురించి ఎవరూ ఊహించని తరుణంలో అతడు నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్‌ సమయంలో ధోనీతో ఈ విషయంపై మాట్లాడతాం. అతడి అభిప్రాయం మేరకు ప్రణాళిక రచిస్తాం. మ్యాచ్‌కు ధోనీ అంగీకరించకపోయినా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అతడిని సత్కరించడం మాకు గౌరవం’  అని ఆ అధికారి తెలిపారు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన ధోనీ గత శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


logo