గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 16, 2020 , 23:45:14

బీసీసీఐ ఆఫీస్‌ బంద్‌

బీసీసీఐ ఆఫీస్‌ బంద్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యాలయాన్ని మూసేయనుంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మంగళవారం నుంచి ఇంటివద్దే ఉంటూ విధులు నిర్వర్తించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా క్రికెట్‌ టోర్నీలన్నీ రైద్దెన నేపథ్యంలో.. ప్రస్తుతానికి కార్యాలయంలో పెద్దగా పనిలేదని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు అధికారొకరు తెలిపారు. ‘కొవిడ్‌-19 నేపథ్యంలో మంగళవారం నుంచి బీసీసీఐ కార్యాలయం మూతబడనుంది. సిబ్బంది ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీఅయ్యాయి’అని ఆయన అన్నారు. మహమ్మారి దెబ్బకు ఇప్పటికే భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దుకాగా.. ఐపీఎల్‌ 13వ సీజన్‌ రెండు వారాలు వాయిదా పడింది. ప్రస్తుతానికి ఇరానీ కప్‌, విజ్జీ ట్రోఫీ సహా.. దేశవాళీ టోర్నీలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.


logo
>>>>>>