శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 01:01:11

కరోనా పరీక్షలకు 10 కోట్లు

కరోనా పరీక్షలకు 10 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఐపీఎల్‌ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపేందుకు బీసీసీఐ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నది. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రామాణిక నిర్వహణ పద్ధతి(ఎస్‌వోపీ) మార్గదర్శకాలను విడుదల చేసిన బోర్డు..అందుకు తగ్గట్లు చర్యలు తీసుకుంటున్నది. లీగ్‌ కోసం యూఏఈకి బయల్దేరే ముందు నుంచి అక్కడికి చేరుకున్న తర్వాత వరుస విరామాల్లో అన్ని జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇప్పటివరకు దాదాపు 20వేల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల కోసం బీసీసీఐ రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ అధికారి తెలిపాడు. పరీక్షల నిర్వహణను యూఏఈకి చెందిన వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ సంస్థకు బీసీసీఐ అప్పగించింది. పన్నులు మినహా ఒక్కో టెస్టుకు 200 దిర్హమ్‌లు(రూ.3974) సదరు కంపెనీకి చెల్లిస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 


logo