ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 17:56:41

IPL 2020: రూ.10 కోట్లతో 20వేల కరోనా టెస్టులు చేయనున్న బీసీసీఐ

IPL 2020: రూ.10 కోట్లతో 20వేల కరోనా టెస్టులు చేయనున్న బీసీసీఐ

దుబాయ్‌: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సందర్భంగా ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సుమారు 20వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేసింది. ఇందు కోసం రూ.10కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా పరీక్షల ఖర్చును ఎనిమిది ఫ్రాంఛైజీలు భరించగా యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్‌   టెస్టుల ఖర్చును బీసీసీఐ భరించనుంది. 

 మేం కరోనా పరీక్షలు నిర్వహించడానికి యూఏకి చెందిన వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎన్ని పరీక్షలు చేస్తామనేదానిపై కచ్చితంగా ఓ సంఖ్యను చెప్పలేను. కానీ మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 20వేలకు పైగా ఉంటుంది.  ఇందులో ప్రతిఒక్కరూ ఉంటారు. పన్నులు కాకుండా ప్రతి పరీక్షకు  బీసీసీఐకి 200 దిర్హామ్‌ల ఖర్చు అవుతుందని ఐపీఎల్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. 

'ఐపీఎల్‌ సమయంలో కొవిడ్‌-19 పరీక్షల కోసం బీసీసీఐ రూ.10కోట్లను ఖర్చు చేస్తుంది. కంపెనీకి చెందిన 75 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు ఐపీఎల్‌ టెస్టింగ్‌ ప్రక్రియలో భాగమేనని' ఆధికారి చెప్పారు. 'ఆటగాళ్లు, అధికారుల భద్రతకు సంబంధించి ఎలాంటి అలసత్వం వహించేది లేదు. హెల్త్‌కేర్‌ వర్కర్లు ప్రత్యేక హోటల్‌లో ఉంటారని' ఆయన వివరించారు. logo