ఆ ఇద్దరి కోసం క్వారంటైన్ నిబంధనలు సడలించండి: బీసీసీఐ

ముంబై: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, పేసర్ ఇషాంత్ శర్మలను ఆడించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు వీరిద్దరూ బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్నారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల కోసం క్వారంటైన్ నిబంధనలు సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో బీసీసీఐ చర్చిస్తున్నట్లు సమాచారం. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా టెస్టు సిరీస్ ఆరంభంకానుంది.
క్రీడాకారుల నిర్బంధ నిబంధనల సడలింపునకు సంబంధించి బీసీసీఐ ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతోంది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 13 వరకు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఏ టీమ్‌తో భారత జట్టు తలపడనుంది. ఒకవేళ వీరిద్దరి కోసం క్వారంటైన్ రూల్స్ సడలిస్తే సన్నాహాక మ్యాచ్ ఆడేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఆదేశానికి చేరుకున్నవారెవరైనా 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సిందే.
తాజావార్తలు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి