మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 03:54:20

నెలాఖరులోగా సెలెక్టర్ల ఎంపిక

 నెలాఖరులోగా సెలెక్టర్ల ఎంపిక

ముంబై: టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీలో భర్తీ చేయాల్సిన రెండు స్థానాలను ఈ నెలాఖరులోగా ఎంపిక చేస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గగన్‌ కోడా గడువు ముగియడంతో వారి స్థానాల్లో కొత్తగా ఇద్దరిని ఎంపిక చేయనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బీసీసీఐ ఇటీవలే మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌తో కూడిన కొత్త క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ)ని ఎంపిక చేసింది. ‘కొత్త సీఏసీ ఎంపిక జరిగింది. ఈ నెలఖరులోగా సెలెక్టర్లను ఎంపిక చేయనున్నాం’ అని గంగూలీ సోమవారం పేర్కొన్నాడు. ప్రస్తుతం చీఫ్‌ సెలెక్టర్‌ బరిలో నిలిచినవారిలో అజిత్‌ అగార్కర్‌, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ ముందు వరుసలో ఉన్నారు.
logo
>>>>>>