శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:12:40

నేడే ఐపీఎల్‌ షెడ్యూల్‌: దాదా

నేడే ఐపీఎల్‌ షెడ్యూల్‌: దాదా

న్యూఢిల్లీ: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ శుక్రవారం విడుదల కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం వెల్లడించాడు. ‘షెడ్యూల్‌ ఆలస్యమైంది. అయితే ఇప్పుడు రూపకల్పన పూర్తయింది. శుక్రవారం విడుదల చేస్తాం’ అని ఓ టీవీ చానెల్‌తో చెప్పాడు. కరోనా వల్ల యూఏఈ వేదికగా బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ నెల 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగనుంది. 


logo